12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి

12 రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా ఉధృతి

భారత్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. స్వల్ప హెచ్చు తగ్గులతో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకు పైగానే నమోదవుతుండడం ఆందోళన కల్గిస్తోంది. గత వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడంతో క్రియాశీల కేసుల సంఖ్య 16 వేలు దాటింది. 

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

  • గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా.. 2,541మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతంగా ఉంది. 
  • గత 24 గంటల్లో 1,862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 
  • ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 16,522 మందికి పైగా కరోనాతో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 0.04 శాతంగా ఉంది. 
  • నిన్న మరో 30 మంది  కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5,22,223 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. 

రోవైపు భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 3.64 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తల కోసం..

ఎల్ఐసీలో 3.5% వాటా అమ్మకానికి ఓకే

ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఘన విజయం