నిండుతున్న కర్నాటక ప్రాజెక్టులు

నిండుతున్న కర్నాటక ప్రాజెక్టులు
  •     ఆల్మట్టి నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు రిలీజ్

గద్వాల, వెలుగు: కర్నాటకలోని కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం నుంచి ఆదివారం రాత్రి 7 గంటలకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి దగ్గర 517.52 (ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ 519.60 మీటర్లు) మీటర్ల లెవెల్ వరకు నీటిని నిల్వ చేసి 15 వేల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 28,130 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. నారాయణపూర్  డ్యాంలో 37.64 టీఎంసీలకు  గాను, 25.815 టీఎంసీల నిల్వ ఉంది. 

ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3,413 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తున్నది. త్వరలో అక్కడి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటాయని, దిగువకు నీరు విడుదల చేసే చాన్స్ ఉందని జూరాల ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూరాల లో 317.490 మీటర్ల నిల్వ ఉండగా, 3,271 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కుల నీరు, భీమా లిఫ్ట్​కు 528 క్యూసెక్కులు, లిఫ్ట్  కెనాల్​కు 390 క్యూసెక్కుల నీరు, మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,778 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.