కరోనాతో పిల్లల గుండెకు చేటు

కరోనాతో పిల్లల గుండెకు చేటు
  • కొన్ని వారాల్లోనే సైలెంట్ గా వస్తున్న ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్
  • లైఫ్ లాం గ్ పర్యవేక్షణ అవసరమంటున్న అమెరికా సైం టిస్టులు

హూస్టన్కరోనా మహమ్మారి సోకిన పిల్లల్లో కొందరికి ఇమ్యూన్ సిస్టం ఓవర్ గా రియాక్ట్ కావడం వల్ల కొత్త రకం ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ వస్తోందని అమెరికా సైంటిస్టులు వెల్లడించారు. వైరస్ సోకిన తర్వాత ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే.. మూడు నాలుగు వారాల్లోనే ఈ సిండ్రోమ్ సైలెంట్ గా పిల్లల గుండెను డ్యామేజ్ చేస్తోందని వారు హెచ్చరించారు. కరోనాతో లింక్ ఉన్న ఈ సిండ్రోమ్ వచ్చిన పిల్లలకు లైఫ్ లాంగ్ మానిటరింగ్, ట్రీట్ మెంట్లు అవసరం ఉంటుందని చెప్తున్నారు. కరోనా తర్వాత వస్తున్న ఈ కొత్త రకం ‘మల్టీసిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ (ఎంఐఎస్-సీ)’ బారిన పడిన 662 మంది పిల్లల కేస్ స్టడీలపై యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. కరోనా సోకినా ఎలాంటి సింప్టమ్స్ కనిపించని, లేదా స్వల్ప సింప్టమ్స్ కనిపించిన పిల్లల్లో కొందరికి మూడు నాలుగు వారాలకే ఎంఐఎస్-సీ వచ్చినట్లు రీసెర్చ్ లో గుర్తించారు. ‘‘అసలు పిల్లలకు కరోనా సోకినా, సింప్టమ్స్ కనిపించకపోవచ్చు. వారికి కరోనా డిసీజ్ వచ్చిందన్న అనుమానం కూడా రాకపోవచ్చు. కానీ కొన్ని వారాలకే హెల్దీగా ఉన్న పిల్లల బాడీలో అకస్మాత్తుగా తీవ్రమైన ఇన్ ఫ్లమేషన్ రావచ్చు..’’ అని సైంటిస్టులు వెల్లడించారు.

కవాసకీ డిసీజ్ తో పోలికలు..

పిల్లల్లో ఇమ్యూన్ రెస్పాన్స్ తీవ్రం కావడం వల్ల వచ్చే కవాసకీ డిసీజ్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ల మాదిరిగానే ఎంఐఎస్-సీలోనూ ఒకే రకం సమస్యలు వస్తున్నాయన్నారు. పెద్దల్లో హార్ట్ అటాక్ లకు సంకేతంగా భావించే ట్రోపోనిన్ బయో మార్కర్స్ ఎంఐఎస్-సీ బారినపడిన పిల్లల్లోనూ కనిపించినట్లు వివరించారు. కవాసకీ డిసీజ్ లో మాదిరిగా ఈ సిండ్రోమ్ వల్ల కూడా పిల్లల్లో గుండె రక్త నాళాలు పలుచబడుతున్నాయని, గుండెకు ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని పంప్ చేసే శక్తి తగ్గుతోందని, ఒబెసిటీ ఉన్నవారికి పరిస్థితి మరింత ప్రమాదకరం కావచ్చని చెప్పారు.

ఎంఐఎస్-సీతో  11 మంది చిన్నారులు మృతి 

జనవరి 1 నుంచి జులై 25 మధ్య నమోదైన 662 ఎంఐఎస్-సీ కేస్ స్టడీలను తాము స్టడీ చేయగా.. అందరికీ ఫీవర్ వచ్చిందని, 73 శాతం మందికి కడుపునొప్పి, వాంతులు, 68 శాతం మందికి వాంతులు అయ్యాయని తెలిసినట్లు సైంటిస్టులు చెప్పారు. 71 శాతం మంది పిల్లలు ఐసీయూలో చేరాల్సి వచ్చిందని, 60 శాతం మంది పిల్లల్లో ఇమ్యూన్ రెస్పాన్స్ తీవ్రంగా మారినట్లు గుర్తించామన్నారు. 54 శాతం మంది పిల్లల్లో ఎకోకార్డియోగ్రామ్ హార్ట్ స్కాన్ లో గుండె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తేలిందని చెప్పారు. ఐదొంతుల మంది పిల్లలకు వెంటిలేషన్ అవసరమైందని, వీరిలో 11 మంది చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు. గుండెతో పాటు లంగ్స్, కడుపు, నాడీ వ్యవస్థ వంటి ఇతర అవయవాలనూ ఈ సిండ్రోమ్ దెబ్బతీస్తుందని, అందువల్ల దీనిని ప్రాణాంతకంగా భావించాలని సైంటిస్టులు చెప్పారు. కరోనాకు దీనితో లింక్ ఉన్నందున, దీని గురించి ఇంకా అర్థం