యూఎస్‌లో గడ్డకట్టిన చెరువులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన అధికారులు

యూఎస్‌లో గడ్డకట్టిన చెరువులో చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన అధికారులు

గడ్డకట్టిన చెరువులో మునిగిపోతున్న తొమ్మిదేళ్ల బాలుడిని, అతన్ని రక్షించడానికి వెళ్లిన మహిళను అధికారులు రక్షించారు. ఈ సంఘటన యూఎస్ లో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియోను అరోరా పోలీసు డిపార్ట్మెంట్ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. మంచు ద్వారా పూర్తిగా గడ్డకట్టిపోయిన ప్రాంతంలో పడిన ఫుట్ బాల్ ను తీసుకునేందుకు తొమ్మిదేళ్ల బాలుడు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని గమనించిన ఓ మహిళ.. ఆ బాలున్ని రక్షించే క్రమంలో ఆమె కూడా ప్రమాదంలో చిక్కుకుపోయింది.

అయితే సీసీ కెమెరాల ద్వారా గమనించిన అధికారులు.. ఘటనాస్థలికి చేరుకొని తమ రెస్క్యూ కిట్ ల సాయంతో వారిద్దరినీ బయటికి లాగారు. అయితే  ఆ బాలునికి స్వల్వ గాయాలు కాగా, అతన్ని అరోరా అగ్నిమాపక సిబ్బంది దగ్గర్లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రక్షించడానికి వెళ్లిన మహిళకు సంఘటనా స్థలంలోనే చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఇద్దరు అరోరా అధికారులకు స్వల్ప గాయాలయినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహిళ చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.