సింగిల్స్ విన్నర్స్ రిత్విక్‌‌, ఇషారాణి

సింగిల్స్ విన్నర్స్ రిత్విక్‌‌, ఇషారాణి

హైదరాబాద్‌‌, వెలుగు : ఎన్‌‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌లో రిత్విక్ సంజీవి, ఇషారాణి బారుహా విజేతలుగా నిలిచారు. ఆదివారం గోపీచంద్ అకాడమీలో జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో రిత్విక్‌‌ 21–14, 21–14తో తరుణ్ రెడ్డిపై విజయం సాధించాడు.

విమెన్స్ ఫైనల్లో  ఇషారాణి 21–15, 19–21, 21–17తో రక్షితశ్రీని ఓడించింది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో పృథ్వి రాయ్‌‌–సాయి ప్రతీక్‌‌,  విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ప్రియ–శ్రుతి మిశ్రా,  మిక్స్‌‌డ్‌‌ లో రుత్వికా శివాని–రోహన్ కపూర్‌‌‌‌ జంటలు టైటిల్స్ నెగ్గాయి.