99.8 శాతంతో పది పాసైంది

99.8 శాతంతో పది పాసైంది

జమ్మూ అండ్ కాశ్మీర్: పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఈ మాటలను అక్షరాల నిజం చేసింది రామ్ నగర్ జిల్లా బదోళి గ్రామానికి చెందిన రీతికా శర్మ. ఇటీవల విడుదల చేసిన టెన్త్  ఫలితాల్లో 500 కి 499 మార్కులు సాధించి ఔరా అనిపించింది. మొత్తం 99.8 పర్సెంట్ తో స్టేట్ టాపర్ గా నిలిచింది. దీంతో ఆ విద్యార్థి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక కూతురు విజయం పట్ల బాలిక తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ గ్రామం నుంచి ఓ బాలిక స్టేట్ టాపర్ గా నిలిచిందని తెలయడంతో ఆ బాలిక ఇంటికి గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అనంతరం ఆమెను అభినందించారు. ఇకపోతే ఆర్మీ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని రీతికా చెబుతోంది.