
బ్యాంకాక్: ఆసియా అండర్ 19, అండర్-22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఇండియా బాక్సర్లు తమ పంచ్ పవర్ చూపెట్టారు. రెండు ఏజ్ గ్రూప్‌ల్లో కలిపి 27 మెడల్స్ సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన అండర్ 22 విభాగంలో రితికా గోల్డ్ మెడల్ సొంతం చేసుకోగా.. మరో నలుగురు సిల్వర్ మెడల్స్ తెచ్చారు. విమెన్స్ హెవీవెయిట్ 80+ కేజీ ఫైనల్లో రితికా.. కజకిస్తాన్ బాక్సర్ అస్సెల్ టోక్టాస్సిన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒత్తిడిలోనూ నిలకడగా రాణించిన రితికా తన ప్రత్యర్థిపై కొన్ని కీలకమైన పంచ్‌లతో విజయం అందుకుంది.
యాత్రి పటేల్ ( 57 కేజీ) ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఖుమోరబోను మమాజోనోవా చేతిలో ఓడగా, ప్రియా (60 కేజీ) 2–3తో యు టియాన్ (చైనా) చేతిలో పోరాడి ఓడి రజతంతో తిరిగొచ్చారు. మెన్స్ 75 కేజీ ఫైనల్లో నీరజ్.. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన షావ్‌కట్‌జోన్ బోల్టయేవ్ చేతిలో, 90+ కేజీ తుదిపోరులో ఇషాన్ కటారియా మరో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఖలిమ్‌జోన్ మమాసోలియేవ్ చేతిలో ఓడి రజత పతకాలను గెలుచుకున్నారు.