
కోరుట్ల, వెలుగు: మున్సిపల్ అధికారులు రూల్స్ ప్రకారమే నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని, లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ వరంగల్ఆర్జేడీ షాహీద్మసూద్ హెచ్చరించారు. గురువారం కోరుట్ల మున్సిపల్ ఆఫీస్‌ను ఆయన తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో పౌర సేవలు, రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, ఇంజినీరింగ్ విభాగాల రికార్డులను పరిశీలించారు. పనుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలపై వివరాలు సేకరించారు. సిబ్బంది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కమిషనర్చాంబర్లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలపై ఆఫీసర్లను విచారించారు. మున్సిపాలిటీలో రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని మూడు నెలల కింద ఆర్జేడీకి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలోనే ఆర్జేడీ కోరుట్ల మున్సిపాలిటీని తనిఖీ చేసినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, మేనేజర్ శ్రీనివాస్, టీపీవో ప్రవీణ్, టీపీఎస్ రమ్య, పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.