డీసీఎం ఢీకొని ఒకరు మృతి .. ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఘటన

డీసీఎం ఢీకొని ఒకరు మృతి .. ఇబ్రహీంపట్నం చౌరస్తాలో  ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మంచాల మండలం లింగంపల్లి అనుబంధ గ్రామం మనోహరాబాద్ కు చెందిన హనుమండ్ల పెంటయ్య(55) నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో  మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.