ప్రాణం తీసిన అతివేగం

ప్రాణం తీసిన అతివేగం
కీసర, వెలుగు: ఓఆర్ఆర్​పై​ జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం లింగంపల్లికి చెందిన కొలిపాక సుమన్.. గచ్చిబౌలిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో మార్కెటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య రోషిని(23), కూతురు వైష్ణవితో కలిసి స్వగ్రామం నుంచి బుధవారం కారులో సిటీకి బయలుదేరారు. కీసర పరిధిలోని ఓఆర్‌ఆర్‌ మైల్‌స్టోన్ 78 వద్ద అతివేగంగా వెళ్లి, ముందువెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించగా, రోషిని ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర  సీఐ వెంకటయ్య తెలిపారు.