షాపులపైకి దూసుకెళ్లిన కారు... బొల్లారంలో ఘటన

షాపులపైకి  దూసుకెళ్లిన కారు... బొల్లారంలో ఘటన

అల్వాల్, వెలుగు: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నపడంతో అది అదుపుతప్పి పలు షాపులపైకి దూసుకెళ్లింది. మచ్చు బొల్లారం నుంచి సెలెక్ట్ థియేటర్ వైపునకు సోమవారం వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఫుట్ పాత్ పై ఉన్న టిఫిన్ సెంటర్, ఇతర షాపులపైకి దూసుకెళ్లింది. షాపులు ధ్వంసం కాగా, కారు డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.