
హైదరాబాద్: శివార్లలోని రోడ్డు ప్రమాదంలో పోలీసు దంపతులు మృతి చెందిన సంఘటన అర్థరాత్రి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సుల్తాన్ బజార్‌కి చెందిన డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్, భార్య ఝాన్సీగా పోలీసులు గుర్తించారు.