
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న శంకుస్థాపన దిమ్మెను ఢీ కొనడంతో తమళంపుడి సూరి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన ఎనిమిది ఏళ్ల హేమంత్ రెడ్డి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతులు,క్షతగాత్రులు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వారి స్వస్థలం రాజమండ్రి. సత్తుపల్లి లో ప్రథమ చికిత్స చేసిన ఐదుగురు క్షతగాత్రులను రాజమండ్రికి తరలించారు.