V6 News

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తడుకుపేట దగ్గర రెండు కార్లు ఢీకొని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. 

మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పోటు కార్మికులు కాగా.. మరొకరు తమిళనాడు వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు కూడా తమిళనాడుకు చెందినవారేనని తెలిపారు. చనిపోయిన ఆలయ పోటు కార్మికులను శంకర, సంతానంగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.