తమిళనాడులో 2 రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి

తమిళనాడులో 2 రోడ్డు ప్రమాదాలు.. 14 మంది మృతి

తమిళనాడులో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కలిపి 14 మంది మృతి చెందారు. 19 మందికి గాయాలయ్యాయి. తూత్తుకుడి జిల్లా కలింగనల్లు దగ్గర రాత్రి అదుపు తప్పి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. 9 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడినవారిని పాలయం కొట్టై హాస్పిటల్ కు తరలించారు. మృతులు మురగన్, పాకియలక్ష్మి, ముత్తులక్ష్మి, అరుణాచల పాండుయన్, జగదీశ్వరన్ గా గుర్తించారు.

కల్లకుర్చిలో మరో ప్రమాదం

కల్లకుర్చి దగ్గర జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. చెన్నై నుంచి కాంగేయం వెళ్తున్న బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో  బొలెరోలోని 6 మంది, బస్సులోని ఇద్దరు చనిపోయారు. 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కల్లకుర్చి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.