ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 573 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరాలను శుక్రవారం వెల్లడించారు. ములుగు జిల్లాలోని ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌--‌‌–163 సెక్షన్​లోని హైదరాబాద్- – భూపాలపట్నం హైవే విస్తరణకు రూ.136.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో లక్నవరం సరస్సు, బొగత జలపాతాలను కలుపుతూ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, చత్తీస్​గఢ్​ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానాన్ని కూడా మెరుగుపరుస్తుందని వివరించారు. రూ.436 కోట్ల వ్యయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుపుతూ నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో కృష్ణా నదిపై ఐకానిక్ అప్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జితో సహా, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-167కేలో 2/4 వరుసల రోడ్డుకు సంబంధించిన ప్రాజెక్టుకు ఆమోదం తెలిపామన్నారు. 

పునరావాసం, విస్తరణకు ఈపీసీ పద్ధతిలో ఆమోదం లభించిందన్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-167కే నిర్మాణంతో హైదరాబాద్–కల్వకుర్తి,  తిరుపతి – నంద్యాల – చెన్నై వంటి నగరాలకు ప్రయాణం 80 కిలోమీటర్లదాకా తగ్గుతుందని చెప్పారు. కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద నిర్మాణం కోసం మంజూరైన ఐకానిక్ వంతెన రెండు రాష్ట్రాలకు గేట్​వే అవుతుందని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు.