గోదావరికి భారీగా వరద.. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు బంద్..

గోదావరికి భారీగా వరద.. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు బంద్..

గత మూడురోజులుగా ఎడతెరపి కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయ్యింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి గంట గంటకు వరద ఉదృతి పెరుగుతుండగా... ప్రస్తుతం 15. 020 అడుగులకు చేరింది ప్రవాహం. బుధవారం ( ఆగస్టు 29 ) మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. 

వాజేడు మండలం టేకులగూడెం దగ్గర జాతీయ రహదారిపై ఉన్న లో లెవెల్  బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న క్రమంలో తెలంగాణ, చతిస్గడ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.సమ్మక్క సారక్క బ్యారేజ్ నుండి దిగువకు అధిక వరద ప్రవాహం రావడంతో బ్రిడ్జి నీట మునిగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా.. పేరూరు దగ్గర ప్రస్తుతం 16.050 అడుగుల మేర ప్రవహిస్తోంది గోదావరి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.భారీ వర్షాల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.