అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..పోలీసులపై ఎదురుకాల్పులు!

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..పోలీసులపై ఎదురుకాల్పులు!

ఏపీలోని బాపట్ల జిల్లాలో అర్థరాత్రి రైలులో దొంగల బీభత్సం సృష్టించారు.  చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ ప్రెస్ ను ఆపి దోపిడీకి యత్నించారు. అప్పికట్ల-మాచవరం మధ్యరు  రైలు చేరుకోగానే దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ప్రయాణికులు కేకలు వేయడంతో చైన్ లాగి పరారయ్యారు. వీరిని అడ్డుకునేందుకు GRP పోలీసులు కాల్పులు జరపగా, దొంగలు కూడా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో అప్పికట్ల, బాపట్ల స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారుజామునఈ ఘటన జరిగింది. బాపట్ల శివార్లలోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో దోపిడి దొంగలు  ప్రయాణికులను దోచుకునేప్రయత్నం చేశారు. చెంగల్పట్టులో రైలు ఎక్కిన దొంగలు, 3, 6 నంబర్ కోచ్‌లలో నిద్రిస్తున్న మహిళా ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం, విలువైన వస్తువులను లాక్కోవడానికి ప్రయత్నించారని ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) డీఎస్సీ అక్కేశ్వరరావు తెలిపారు.

భయపడిన ప్రయాణికులు గందరగోళం సృష్టించారు. తర్వాత రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కొందరు ఎమర్జెన్సీ చైన్‌ను లాగడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత దొంగలు కిందకు దూకి సమీపంలోని పొలాల్లోకి పారిపోయారు. వారిని వెంబడిస్తున్న సమయంలో రైల్వే పోలీసులు అనుమానితులపై తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు.. కానీ వారు పొలాల గుండా బాపట్ల-గుంటూరు రహదారి వైపు తప్పించుకున్నారు. దుండగులకు చెందిన రెండు బ్యాగులను తర్వాత స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు.