ధరణితో దొరల దోపిడీ

ధరణితో దొరల దోపిడీ
  • అది రాష్ట్రానికి దరిద్రం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్, వెలుగు: తమకు నచ్చిన భూములను దోచుకోవడానికి దొరలు తెచ్చుకున్న ధరణి రాష్ట్రంలో ఒక దరిద్రం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ పోర్టల్ వల్ల కలెక్టర్ లు కలెక్షన్ కింగులయ్యారని ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో శంకర్​మాట్లాడుతూ ధరణి వల్ల ఇబ్బందులకు గురై పేద రైతులు ఎందరో చనిపోయారని చెప్పారు. 

లోపభూయిష్టమైన ధరణిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉన్న దొరలు ధరణిని తమ ఇష్టానుసారంగా వాడుకున్నారని, వేలాది ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు. అలాగే భూములకు సంబంధించిన చిన్నచిన్న అంశాలు కూడా పరిష్కారానికి నోచుకోకుండా చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ధరణితో రైతులకు ఏం ప్రయోజనం లేదన్నారు.