వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది

రోహిత్‌‌ సిక్సర్.. మూవింగ్‌‌ బస్‌‌పై బాల్‌‌

అబుదాబి: ఒక రోజు ముందు ఫ్యామిలీతో కలిసి బీచ్‌‌లో ఎంజాయ్‌‌ చేసిన ముంబై ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ ప్రాక్టీస్​లో దుమ్మురేపుతున్నాడు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్​లో  ఓ స్పిన్నర్​ బౌలింగ్‌‌లో అతను క్రీజు ముందుకొచ్చి ఓ  సిక్సర్​ కొట్టాడు. ఈ షాట్‌‌కు లాంగాన్‌‌ మీదుగా 95 మీటర్లు వెళ్లిన బాల్‌‌  స్టేడియం ముందు నుంచి వెళ్తున్న బస్సు టాప్‌‌పై పడింది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్‌‌ ట్విట్టర్​లో పోస్ట్‌‌ చేసింది. ‘బ్యాట్స్‌‌మెన్‌‌ సిక్సర్లు కొడతారు. లెజెండ్స్‌‌ బంతిని స్టేడియం దాటిస్తారు. హిట్‌‌మ్యాన్‌‌ సిక్సర్ ​కొడితే అది స్టేడియం దాటడమే కాదు మూవింగ్‌‌ బస్‌‌ను కూడా తాకుతుంది’ అని ఎంఐ రాసుకొచ్చింది.  మరోవైపు దీపక్​ చహర్​ (చెన్నై) కరోనా నుంచి కోలుకున్నాడు. కొవిడ్​ టెస్ట్​లో అతనికి నెగెటివ్​ రిజల్ట్​ వచ్చింది.

For More News..

డిస్కంలకు 261 కోట్ల షాక్