Team India: భారత క్రికెట్ జట్టులో అనేక మార్పులు, ప్లేయర్స్ మధ్య ఉండే బాండింగ్ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతుంది. తాజాగా శ్రేయస్ అయ్యర్ కి టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ ని సారథ్య బాధ్యతలతో పాటు జట్టు నుంచి పూర్తిగా తప్పించడంపై తీవ్ర చర్చకు దారి తీసింది.
శ్రేయస్ పై సూర్య ప్రశంసలు:
భారత జట్టు టీ20 కెప్టెన్సీని శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వడంపై సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్ ని సారథిగా ఎంపిక చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడి తీసుకునే నిర్ణయాలు, ఒత్తిడిని జయించే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది, టీమిండియాని కూడా విజయపథంలో నడిపించాలని కోరుకుంటున్నట్లు సూర్యకుమార్ వెల్లడించారు.
శ్రేయస్ పై రోహిత్ కామెంట్స్ వైరల్:
మరోవైపు, టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పై సీనియర్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రేయస్ కి జట్టుని నడిపించే నైపుణ్యం ఉంది.. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్లోనూ అతను కెప్టెన్ గా తనని తాను పూర్తిగా నిరూపించుకున్నాడు.. కానీ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అనేది ఎప్పుడూ పెను సవాలే.. అయ్యర్ ఈ బాధ్యతని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, జట్టుని ఎలా ముందుకు నడిపిస్తాడో అనేది ఆసక్తికరంగా మారిందని రోహిత్ శర్మ తనదైన స్టైల్ లో వ్యాఖ్యానించాడు.
