హార్దిక్‌ కోసం సీఎస్‌కే బిగ్ స్కెచ్.. స్టార్ ప్లేయర్తో పాటు రూ.20 కోట్లు ఆఫర్!

హార్దిక్‌ కోసం సీఎస్‌కే బిగ్ స్కెచ్.. స్టార్ ప్లేయర్తో పాటు రూ.20 కోట్లు ఆఫర్!

Hardik Pandya: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మెగా డీల్ కోసం సీఎస్‌కే, ఆటగాళ్లు+ నగదు రూపంలో దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన భారీ ప్యాకేజీని ముంబైకి ఆఫర్ చేసినట్లు సమాచారం.  

సీఎస్‌కే ట్రేడింగ్ ఆప్షన్స్: 
హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి సీఎస్‌కే రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది. మొదటి ఆప్షన్ ప్రకారం విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేతో పాటు యంగ్ సెన్సేషన్ డేవాల్డ్ బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్‌కు పంపడం, ఇక రెండో ఆప్షన్ ప్రకారం శివమ్ దూబేతో పాటు భారీ మొత్తంలో నగదును ఆఫర్ చేయడం.. హార్దిక్ పాండ్యా ప్రస్తుత కాంట్రాక్ట్ విలువ కంటే ఈ ప్యాకేజీ విలువ చాలా ఎక్కువగా ఉండటంతో, ఈ అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ముంబైకి కలిగే ప్రయోజనాలు: 
ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ పూర్తయితే ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్‌ను గెలిపించగల పవర్ హిట్టర్ శివమ్ దూబే జట్టులోకి వస్తాడు. అలాగే భవిష్యత్తు స్టార్‌గా భావిస్తున్న డేవాల్డ్ బ్రెవిస్ సేవలు కూడా జట్టుకి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, నగదు రూపంలో వచ్చే మొత్తంతో పాటు హార్దిక్ భారీ జీతం ఆదా అవ్వడంతో రాబోయే వేలంలో కొత్త ప్లేయర్స్ ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్‌కు పర్స్ లిమిట్ పెరుగుతుంది.

►ALSO READ | బుమ్రా ఫిట్నెస్పై సందిగ్ధత! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్కు డౌటేనా..

ప్రాథమిక చర్చల దశలోనే డీల్: 
ప్రస్తుతానికి ఈ ట్రేడ్ డీల్ కేవలం చర్చల దశలోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఈ డీల్ కుదిరితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత బిగ్ ట్రేడింగ్ డీల్స్‌లో ఒకటిగా నిలిచిపోతుంది.