మాజీ క్రికెటర్లది చెత్త వాగుడు..మేం పట్టించుకోం: రోహిత్ శర్మ

మాజీ క్రికెటర్లది చెత్త వాగుడు..మేం పట్టించుకోం: రోహిత్ శర్మ

మూడో టెస్టులో టీమిండియా ఓటమిపై  మాజీ క్రికెటర్ల విమర్శలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. మూడో టెస్టులో భారత జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఓటమిపాలైందన్న మాజీల మాటలు చెత్తవాగుడని మండిపడ్డాడు. మొదటి రెండు టెస్టులు గెలిచిన తర్వాత ఈ రకంగా విమర్శలు చేయడం సరికాదన్నాడు. 

రవిశాస్త్రికి కౌంటర్..

మొదటి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా  ఆటగాళ్లకు విజయ గర్వం తలకెక్కిందని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి  మూడో టెస్టులో ఓడిపోయారని మాజీ  క్రికెటర్ రవి శాస్త్రి  విమర్శించాడు. ఈ విమర్శకు సమాధానమిచ్చిన రోహిత్ శర్మ...రెండు టెస్టుల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఆటగాళ్లు అతి విశ్వాసంతో ఉన్నారనే చర్చ చెత్త వాగుడే అని...చెప్పుకొచ్చాడు.  అయితే ప్రత్యర్థిపై ఏ పరిస్థితుల్లోనైనా చెలరేగడమే తమ ఆటగాళ్ల ఉద్దేశమన్నాడు. కానీ ఇది కొందరికి ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తే తాము ఏం చేయలేమన్నాడు. 

బ్యాటింగ్ వైఫల్యమే..

పిచ్ ఎలాంటిదని కాకుండా..ఏ పరిస్థితుల్లో అయినా ఆడాలనేదే తమ లక్ష్యమని రోహిత్ శర్మ తెలిపాడు.  టెస్టు కండిషన్స్ ను పట్టించుకోకుండా రన్స్ చేయడానికి ప్రయత్నించాలని తాను ఆటగాళ్లకు చెప్పినట్లు వివరించాడు. మూడో టెస్టులో బ్యాటింగ్ చేయకపోవడం వల్ల ఓడిపోయామన్నాడు. ఏదేమైనా నాల్గో టెస్టులో గెలుపే తమ తదుపరి లక్ష్యమన్నాడు. ఈ టెస్టుకు ఇద్దరు ప్రధానులు వస్తున్నారని..వారి సమక్షంలో మ్యాచ్ ఆడనుండటం సంతోషంగా ఉందని తెలిపాడు.