రోహిత్ కు గాయం

రోహిత్ కు గాయం

న్యూఢిల్లీ: ప్రాక్టీస్‌ సెషన్‌ లో గాయపడ్డ టీమిం డియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తొలి టీ20కి అందుబాటులో ఉండనున్నా డు. గాయం తీవ్రమైంది కాదని, ముం బైకర్‌‌ ఫిట్‌ గానే ఉన్నాడని  బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌ వెల్లడిం చింది. శుక్రవారం నెట్స్‌ లో బ్యాటిం గ్‌ ప్రాక్టీస్‌ చేస్తుం డగా ఓ బంతి రోహిత్‌ పొత్తి కడుపులో బలంగా తాకింది. దీంతో నొప్పితో ఇబ్బం దిపడ్డ ఈ ముం బైకర్‌‌ వెం టనే డ్రెస్సిం గ్‌ రూమ్‌ కు వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ ప్రాక్టీస్‌ కు రాలేదు. అంతకుముందు నెట్స్‌ లో త్రోడౌన్స్‌ ప్రాక్టీస్‌ చేసినప్పుడు కూడా ఓ షార్ప్‌‌ బంతి రోహిత్‌ ఎడమ తొడను తాకింది. దీంతో బాల్‌‌ వేగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అతను అలాగే కొనసాగించాడు. బంగ్లా లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ను ముస్తాఫి జుర్‌‌ను దీటుగా ఎదుర్కొనేందుకు టీమిండియా వ్యూహకర్తలు.. లంక బౌలర్‌‌ నువాన్‌ ను పిలిపించారు. నెట్స్‌ లో  అతను విసిరే త్రోడౌన్స్‌ లో బ్యాట్ స్‌ మెన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

మామూలుగా నెట్స్‌ లో ప్రధాన పేసర్లను ఎదుర్కొవడానికి ముం దు బ్యాట్స్‌ మెన్‌ లయ అందుకోవడానికి ఈ త్రోడౌన్స్‌ ను ప్రాక్టీస్‌ చేస్తారు. మరోవైపు ఇండియాలోని చాలా గ్రౌండ్స్‌ ల్లో ఉండే ప్రాక్టీస్‌ పిచ్‌ ల్లో నాణ్యత తక్కువగా ఉంటుంది. అందుకే నెట్‌ సెషన్స్‌ లో ప్లేయర్లు చాలా అప్రమత్తతో వ్యవహరిస్తుంటారు. ఇక కేరళ వికెట్‌ కీపర్‌‌ సంజూ శాం సన్‌ .. ఫీల్డింగ్‌ చేస్తూ కనిపించాడు. రిషబ్‌ పంత్‌ అదనపు సమయంలో కూడా వికెట్‌ కీపిం గ్‌ ను మెరుగుపర్చుకుంటూ కనిపించాడు. ఈ సిరీస్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారిన బిగ్‌ హిట్టింగ్‌ హీరో శివమ్‌ దూబేపైనే అందరి దృష్టి నెలకొం ది. అతను చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రితో ముచ్చటిస్తూ కనిపిం చాడు.