రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా బాగా రాణిస్తుంది

రోహిత్ కెప్టెన్సీలో  టీమిండియా బాగా రాణిస్తుంది

రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు బాగా రాణిస్తుందన్నాడు న్యూజిలాండ్   ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. ముంబై ఇండియన్స్ లో కీలక బౌలర్ అయిన ట్రెంట్ బౌల్ట్..తాను రోహిత్ కెప్టెన్సీని బౌండరీ లైన్ దగ్గర నుంచి గమనించానన్నాడు. రోహిత్ ఒత్తిడిని బాగా ఎదుర్కోగలడన్నాడు. ‘రోహిత్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు. అతను భారత జట్టును ఎలా నడిపిస్తాడనేది ఉత్కంఠగా మారింది. ముంబయి ఇండియన్స్‌లో అతని కెప్టెన్సీలో ఆడడం నాకు బాగా నచ్చింది. నేను బౌండరీ వద్ద నిలబడి అతనిని, అతని కెప్టెన్సీని, అతని వ్యూహాలను గమనించాను. అతను భారతదేశానికి అత్యంత విజయవంతమైన ఆటగాడు . అతని నాయకత్వంలో జట్టు బాగా రాణిస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను’అని అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో తాను ఒక్క ఆట కూడా ఆడలేదు కానీ..అతను భారత్ కు ఒక శక్తివంతమైన ఆటగాడన్నాడు.