రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు..అత్యధిక సార్లు అతడే

రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు..అత్యధిక సార్లు అతడే

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే డకౌట్ అయి పెవీలియన్ చేరాడు. దీంతో ఐపీఎల్ లోనే అత్యంత చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. 

చెత్త రికార్డు..

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదు చేశాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్ లో 15 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, మన్ దీప్ సింగ్ లు ఉన్నారు. వీరు కూడా 15 సార్లు డకౌట్ అయ్యారు. 

వరుసగా విఫలం..

బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మకు 200వ మ్యాచ్. ఈ ఐపీఎల్ లో రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. అతని స్కోర్లు గమనిస్తే 1, 21, 65, 20, 28, 44, 2, 3, 0తో దారుణంగా విఫలమయ్యాడు.

విజయం...

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్  20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్ పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్ రాణించాడు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్ ఓ వికెట్ తీశాడు. ఆ తర్వాత 215 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 75 పరుగులు చేయగా... సూర్య సూపర్ 66 రన్స్ కొట్టాడు.  పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.