V6 News

MI vs GT పోరు: రోహిత్ వచ్చేస్తున్నాడు!..వరుస ఓటములకు బ్రేక్ పడేనా.?

MI vs GT పోరు: రోహిత్ వచ్చేస్తున్నాడు!..వరుస ఓటములకు బ్రేక్ పడేనా.?

ఐపీఎల్ లో  ఇవాళ (ఏప్రిల్ 20) మరో రసవత్తర పోరుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్‌తో  ముంబై ఇండియన్స్ తలపడనుంది.  వరుసగా నాలుగో విజయంపై గుజరాత్ కన్నేయగా.. మరోవైపు వరుసగా నాలుగు ఓటములతో ముంబై ఇండియన్స్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. గాయాల సమస్యలు ముంబైని మరింత వేధిస్తున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ, మిచెల్ శాంట్నర్ దూరం కావడం ఆ జట్టును దెబ్బతీసింది.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కండరాల గాయం కారణంగా రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడమే కాకుండా  పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ముంబై అభిమానులకు ఒక గుడ్ న్యూస్..  టైటాన్స్‌తో పోరుకు ముందు రోజు(ఏప్రిల్ 19న రాత్రి) రోహిత్ నెట్స్‌లో ముమ్మరంగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు.

ముంబై బౌలింగ్ కోచ్ పరాస్ మ్హంభ్రే కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాడు . రోహిత్, శాంట్నర్ ఇద్దరూ ఫిట్‌గా ఉన్నారని చెప్పారు. రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది. శాంట్నర్ కూడా కోలుకున్నాడని మ్హంభ్రే తెలిపారు.

ఒకవేళ రోహిత్ ఇవాళ గుజరాత్ తో జరిగే మ్యాచ్ కు  తుది జట్టులోకి వస్తే  ముంబైకి మరో  సమస్య ఎదురుకానుంది.  ఓపెనర్ గా గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన క్వింటన్ డి కాక్‌ను కొనసాగిస్తారా? లేక వరుసగా విఫలమవుతున్న ర్యాన్ రికెల్టన్‌ను పక్కన పెడతారా అన్నది  పెద్ద సవాల్.  మరి ఈ కీలక పోరులో ముంబై మళ్ళీ ఫామ్‌లోకి వస్తుందా? లేక గుజరాత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తుందా అన్నది చూడాలి.