భారత్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్ సిరీస్‌ నుంచి కోహ్లీ తర్వాత రోహిత్ ఔట్?

భారత్‌కు బిగ్ షాక్.. ఆఫ్ఘన్ సిరీస్‌ నుంచి కోహ్లీ తర్వాత రోహిత్ ఔట్?

IND vs AFG: క్రికెట్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు బ్యాటర్లూ ఐపీఎల్ 2026 ఆఖరి దశలో హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయాల బారిన పడటమే దీనికి కారణం. జూన్ 13 నుంచి స్టార్ట్ కాబోయే ఈ సిరీస్‌కి ముందే సీనియర్లు దూరం కావడం టీమ్‌కి పెద్ద మైనస్ కానుంది.

 సిరీస్ మిస్ కాబోతున్న రోహిత్ శర్మ?: 
ఐపీఎల్‌లో తగిలిన గాయంతో రోహిత్ శర్మ  ఆఫ్ఘన్ తో జరిగే వన్డే సిరీస్ ఆడటం డౌట్‌గానే ఉంది. హార్దిక్ పాండ్యా, రోహిత్ ఇద్దరినీ స్క్వాడ్‌లోకి తీసుకున్నా... వారు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితేనే జట్టుతో కలుస్తారని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తేల్చి చెప్పారు. కానీ, రోహిత్ ఇప్పటి వరకు అక్కడ రిపోర్ట్ చేయకపోవడంతో అతను సిరీస్ నుంచి తప్పుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 

టీ20లకి, టెస్టులకి రోహిత్ రిటైర్మెంట్: 
39 ఏళ్ల రోహిత్ శర్మ ఆల్రెడీ టీ20లు, టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రెజెంట్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మొన్నటి ఐపీఎల్‌లో 9 మ్యాచుల్లో 283 రన్స్ (స్ట్రైక్ రేట్ 156.22) కొట్టిన హిట్ మ్యాన్, ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 61 రన్స్ మాత్రమే చేసి కాస్త నిరాశ పరిచాడు. 

కింగ్ కోహ్లీ రూల్డ్ అవుట్: 
మరోవైపు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఈ సిరీస్ నుంచి అఫీషియల్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రన్ చేజింగ్ టైమ్‌లో విరాట్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. అయినా సరే పట్టువదలకుండా ఆర్‌సీబీని గెలిపించాడు. కానీ ఆ మ్యాచ్‌లోనే హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ సీరియస్ అవ్వడంతో ఇప్పుడు ఆఫ్ఘన్ సిరీస్‌కు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది.

ALSO READ : ఆఫ్ఘనిస్తాన్తో టెస్టుకు భారత్ ప్లేయింగ్ XI ఫిక్స్?

ఆఫ్ఘన్ సిరీస్ షెడ్యూల్: 
న్యూ చండీగఢ్‌లో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. జూన్ 13 నుంచి భారత్– ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. రోహిత్, విరాట్ ఇద్దరూ లేకుండా హోమ్ గ్రౌండ్‌లో వన్డే సిరీస్ ఆడటం అంటే టీమిండియాకి ఒక పెద్ద టాస్కే అని చెప్పాలి.. మరి 'రో-కో' (Ro-Ko) లేని లోటును భర్తీ చేస్తూ భారత కుర్రాళ్లు ఏ రేంజ్‌లో ఆడతారో అనేది వేచి చూడాలి మరీ.