సిక్సర్ తో ఖాతా తెరిచిన రోహిత్.. బంగ్లాపై గతంలో సెంచరీ

సిక్సర్ తో ఖాతా తెరిచిన రోహిత్.. బంగ్లాపై గతంలో సెంచరీ

ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న కీలకమైన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్ రోహిత్ శర్మ భారీ సిక్సర్ తో తన పరుగుల ఖాతాను తెరిచాడు. అభిమానులకు, బంగ్లాదేశ్ జట్టుకు తన ఉద్దేశాన్ని చాటాడు. ఇంగ్లండ్ పై సెంచరీ కలుపుకుని.. ఈ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇప్పటికే 3 సెంచరీలు కొట్టాడు. గత వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ బంగ్లాదేశ్ పై రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మ బంగ్లాదేశ్ పై 137 రన్స్ కొట్టి.. ఇండియా క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లేందుకు సాయపడ్డాడు.