‘హను-మాన్’ విజయానంతరం భారతీయ మూలాలతో కూడిన సినిమా యూనివర్స్‌ని విస్తరించాలనే ప్రశాంత్ వర్మ విజన్‌లో భాగంగా ‘మహాకాళి’ చిత్రం రూపొందుతోంది. ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్ లుక్స్ మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు మేకర్స్ తెలియజేశారు.
నార్త్‌లో మంచి ఫేమ్ ఉన్న రోహిత్ సరాఫ్ ఈ చిత్రంలో నటించడంతో మరింత బజ్ వచ్చిందని అన్నారు. ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
