
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 14 వేల రన్స్ చేసిన ఎనిమిదవ ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇవాళ న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదో టీ20 రోహిత్ శర్మ ఈ ఫీట్ ను అందుకున్నాడు. రోహిత్ కంటే ముందు భారత్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్(155593), వీరేంద్ర సెహ్వాగ్(17253), ఎంఎస్ ధోని(17266), సౌరవ్ గంగూలీ( 18 575), వీరాట్ కోహ్లీ(21788), ద్రవిడ్(24208) సచిన్ టెండుల్కర్(34357) పరుగులతో ఉన్నారు. ఇదే సిరీస్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా 10 వేల రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.