రొమాంటిక్ ఫోజ్ ఇవ్వబోయి నవ్వులపాలైన్రు... పోస్ట్ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్

రొమాంటిక్ ఫోజ్ ఇవ్వబోయి నవ్వులపాలైన్రు... పోస్ట్ వెడ్డింగ్ షూట్ వీడియో వైరల్

వెడ్డింగ్ సీజన్ అయినా, కాకపోయినా వెడ్డింగ్ షూట్ లేదా పెళ్లిళ్లలకు సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తే, మరికొన్ని వీడియోలు అందరి హృదయాలను ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. ఇంకొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. ఈ రోజుల్లో పెళ్లికి ముందే కాదు.. పెళ్లయ్యాక కూడా చాలా మంది పోస్ట్ వెడ్డింగ్ షూట్ అని ఫొటోషూట్ చేసుకుంటున్నారు. అందులో ఓ జంట రొమాంటిక్ స్టిల్ ఇవ్వబోతూ.. అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ ఏం జరిగింది అన్న విషయానికొస్తే..

పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో భాగంగా కొత్తగా పెళ్లయిన ఓ జంట స్టేజీపై ఓ రొమాంటిక్ ఫోజ్ ఇవ్వాలని ట్రై చేసింది. డ్యాన్స్ చేస్తూ వధువు నడుము పట్టుకున్న వరుడు.. ఒక్కసారిగా పట్టును కోల్పోయాడు. దీంతో పెళ్లి కొడుకు చేతుల్లో ఉండాల్సిన పెళ్లి కూతురు ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ సిగ్గుపడతారు.. అది చూసిన అక్కడున్న వారంతా నవ్వడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకు 9మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. 5లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాదు ఈ వీడియోను నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CmMkLclgylC/?utm_source=ig_embed&ig_rid=0c9eee4a-5a63-4a46-92c4-3fa015505b98