హైదరాబాద్ అబిడ్స్ లో ఘనంగా రోజరీ కాన్వెంట్ ‘స్పోర్టివెరా’

హైదరాబాద్ అబిడ్స్ లో ఘనంగా రోజరీ కాన్వెంట్ ‘స్పోర్టివెరా’

హైదరాబాద్ సిటీ, వెలుగు: అబిడ్స్ గన్‌‌ఫౌండ్రీలోని రోజరీ కాన్వెంట్ గర్ల్స్​హైస్కూల్   క్రీడోత్సవాన్ని మంగళవారం స్పోర్టివెరా పేరుతో ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. బాలికల భద్రత కోసం షీ టీమ్స్​పని చేస్తున్నాయని తెలిపారు. 

ప్రిన్సిపాల్ సిస్టర్ జోసెఫిన్ మాట్లాడుతూ.. 1904లో స్థాపించిన తమ స్కూల్ సంపూర్ణ విద్యకు కేంద్రంగా మారిందని తెలిపారు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత శ్రీజ, సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ ఆరోగ్య స్వామి, ఎఫ్‌‌ఎంఎం స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ అన్నా మేరీ తదితరులు పాల్గొన్నారు.