క్రిస్మస్‌‌‌‌కి చాంపియన్.. శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

క్రిస్మస్‌‌‌‌కి చాంపియన్.. శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చాంపియన్’.  ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  పండుగ సీజన్, న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసొస్తుండడంతో బాక్సాఫీస్‌‌‌‌ దగ్గర  బిగ్ బూస్టప్ వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.  రిలీజ్ డేట్ అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌తో  విడుదల చేసిన కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌లో  రోషన్ లాంగ్ డార్క్ ఓవర్‌‌‌‌కోట్, బెల్టెడ్ వెయిస్ట్‌‌‌‌తో క్లాసీ లుక్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ నుంచి బయటకు అడుగుపెడుతూ ఇంప్రెస్ చేశాడు. అనశ్వర రాజన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా ఆర్. మధీ, మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా మిక్కీ జే మేయర్,  ఆర్ట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా  తోట తరణి వంటి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.