
హైదరాబాద్, వెలుగు: ఐటీఎఫ్ సబ్ జూనియర్, జూనియర్, పారా నేషనల్ చాంపియన్‌షిప్‌లో రోషన్ గోంద్, స్నేహల్ జోషి గోల్డ్ మెడల్స్ సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో సోమవారం జరిగిన అక్వాథ్లాన్ మెన్స్ స్విమ్ టీ1 రన్ ఈవెంట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన రోషన్ 6 నిమిషాల 34 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్‌తో గోల్డ్ గెలిచాడు.
అంకుర్ చహర్ (మధ్యప్రదేశ్), ప్రణబ్ దాస్ (ఒడిశా) సిల్వర్, బ్రాంజ్ సాధించారు. విమెన్స్‌లో మహారాష్ట్రకు చెందిన స్నేహల్ జోషి (7:40సె) గోల్డ్ కైవసం చేసుకోగా. . సంజన జోషి (మహారాష్ట్ర), హరిప్రియ (కేరళ) సిల్వర్, బ్రాంజ్ గెలిచారు. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, తెలంగాణ ట్రయథ్లాన్ సంఘం ప్రెసిడెంట్ మదన్ మోహన్ విజేతలకు మెడల్స అందజేశారు.