Delhi liquor scam : నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు

Delhi liquor scam : నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన నిందితులకు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ నాగ్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి సౌత్ గ్రూపులో కీలకంగా వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయి బాబు, విజయ్ నాయర్ లు బెయిల్ కోసం రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరిస్తున్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కేసు దర్యాప్తులో ఉన్నందున నిందితులకు బెయిల్ ఇవ్వద్దని ధర్మాసనాన్ని కోరారు. సౌత్ గ్రూపులోని నిందితులు బయటకు వెళ్తే సాక్ష్యులతో పాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు బెయిల్ నిరాకరించారు. నిందితులంతా 3 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. కోర్టు తీర్పుతో ఇప్పట్లో వారు బయటకు వచ్చే అవకాశం లేదు.