సిటీలో డబుల్​ డెక్కర్​కు రూట్​ క్లియర్.. బస్సులు తిరిగే రూట్లు ఇవే!

సిటీలో డబుల్​ డెక్కర్​కు రూట్​ క్లియర్.. బస్సులు తిరిగే రూట్లు ఇవే!
  • సిటీలో రూట్లను ఓకే చేసిన ఆర్టీసీ అధికారులు
  • ఫస్ట్​ ఫేజ్​లో తిప్పనున్న 25 బస్సులు
  • ఈ నెల 25 న ముగియనున్న టెండర్ ప్రక్రియ

హైదరాబాద్, వెలుగు: డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ సిటీలో కనిపించనున్నాయి. వీలైనంత తొందరగా వీటిని రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ అధికారులు పనులు స్పీడప్ చేశారు. ఇందుకోసం ఆర్టీసీ చేస్తున్న ప్రయత్నాలు చివరిదశకు చేరాయి. ఈ నెల 25 టెండర్ల  ప్రక్రియ పూర్తి కానుంది. టెండర్ కాపీలను సబ్మిట్ చేసేందుకు ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. 18న ప్రీ బిడ్డింగ్, 25 న టెండర్లను పూర్తి చేయనున్నారు.  దక్కించుకున్న కంపెనీ తొలి దశలో ఆర్టీసీకి 25 బస్సులను తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా అమలులోకి వచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్​ రూల్స్​పరిధిలోనే బస్సులను మేకింగ్​చేయాల్సి ఉంది. నిర్వహణ భారం కాకుండా, ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండే విధంగా డిజైనింగ్ చేయిస్తున్నారు. మరో మూడు నెలల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి చేసి బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

2005 వరకు నడిచిన బస్సులు

ఒకప్పుడు ఈ బస్సులకు సిటీలో ఉన్న క్రేజే వేరు. సిటీలో అందాలను చూసేందుకు వచ్చే టూరిస్టులు కచ్చితంగా డబుల్ డెక్కర్ లోనే జర్నీ చేసి ఎంజాయ్ చేసే వారు. పైన ఉన్న డెక్కులో కూర్చొని ట్రావెల్ చేయడం ఓ స్పీట్ మెమరీ ఎక్స్ పీరియన్స్. సికింద్రాబాద్ నుంచి జూ పార్క్ వరకు ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లే బస్సుల్లో ఫుల్ రష్ ఉండేది. నిజాం కాలం నుంచి 2005 వరకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.  కొత్తగా సిద్ధమవుతున్న బస్సులను ఇప్పటి కాలానికి అనుగుణంగా రెడీ చేస్తున్నారు. కొత్తగా రానున్న 25 బస్సులు నాన్ ఏసీవే కానున్నాయి.

సికింద్రాబాద్ నుంచే ఎక్కువ సర్వీసులు

డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే రూట్ల పై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే స్టడీ చేశారు. ఇందులో కొన్ని రూట్లను కూడా ఫైనల్ చేశారు. సికింద్రాబాద్‌‌ -నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్ వరకు, సికింద్రాబాద్‌‌- నుంచి పటాన్‌‌చెరు వయా బాలానగర్‌‌ క్రాస్‌‌ రోడ్,  కోఠి నుంచి -పటాన్‌‌చెరు  వయా అమీర్‌‌పేట, సీబీఎస్‌‌ నుంచి -జీడిమెట్ల వయా అమీర్‌‌పేట్, అఫ్జల్‌‌గంజ్‌‌ -నుంచి మెహిదీపట్నం వరకు రూట్లు ఓకే చేశారు. మిగతా రూట్లలో ఫీజిబులిటీని పరిశీలిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్ నుంచే డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కువగా తిరిగేవి. ఈసారి కూడా సికింద్రాబాద్ కేంద్రంగానే ఎక్కువ రూట్లను సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో ఫేమస్ రూట్ అయిన సికింద్రాబాద్ టూ జూ పార్క్ ప్రయాణం ఈసారి ఉండదని అధికారులు చెప్పారు. ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ కారణంగా ఈరూట్ లో బస్సులు తిప్పడం  సాధ్యం కాదని తేల్చారు. టూరిజం స్పాట్ గా గుర్తింపు పొందుతున్న కేబుల్ బ్రిడ్జి మీదుగా డబుల్ డెక్కర్ పై జర్నీ చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

For More News..

ఫంక్షన్ హాళ్లో కోచింగ్ సెంటర్.. కరోనా భయం లేకుండా వందలమంది ఒకేచోట

జైళ్లలో పెడితే భయపడతమా? జైళ్లే బీజేపీ విజయానికి నాంది

బెల్టు షాపులు తెరిచి యువతను లిక్కర్‌కు బానిసలు చేస్తున్నరు