మద్యంమత్తులో రైల్వే ఉద్యోగిపై రౌడీ షీటర్ దాడి

మద్యంమత్తులో రైల్వే ఉద్యోగిపై రౌడీ షీటర్ దాడి

సికింద్రాబాద్ లోని మెట్టుగూడలో దారుణం జరిగింది. మద్యం మత్తులో రెచ్చిపోయిన ఓ రౌడీ షీటర్.. రాకేష్ అనే రైల్వే ఉద్యోగిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన రాకేష్ ను హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర గాయాలుకావడంతో రాకేష్ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 20 నిమిషాల్లోనే నిందితుడు భాగ్యరాజుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాగా.. చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేశారు. నిందితుడు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా సేవించినట్లు స్థానికులు అంటున్నారు. రౌడీ షీటర్ భాగ్యరాజును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో చిలకలగూడ పోలీసులకు భాగ్యరాజు గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రౌడీలపై నిఘా పెంచి మరోసారి ఇలా చేయకుండా సరైన శిక్షలు అమలు చేయాలని కోరారు. రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించమని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్, నార్త్ జోన్ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావులు హెచ్చరించారు.

For More News..

మిడతలొస్తున్నయ్ జాగ్రత్త..

పనివాళ్లను ఫ్లైట్లో సొంతూరికి పంపించిన యజమాని

హోటళ్లో అగ్ని ప్రమాదం.. లోపల 25 మంది కరోనా డాక్టర్లు