
రౌడీషీటర్ అంతిమ యాత్రలో పోలీసుల ముందే కొందరు రౌడీషీటర్లు, జులాయిలు తల్వారలతో హల్ చల్ చేసినా.. పోలీసులు ఏమి చేయలేక పోయినారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనం రేపింది. గ్యాంగ్ వార్ లో మంథిని సుమన్ అనే రౌడీషీటర్ ను గోదావరిఖని నడి బొడ్డున కత్తులతో పోడిచి హత్య చేశారు. అయితే సుమన్ అంతిమ యాత్రకు రౌడీషీటర్లు, జులాయిలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పోలీసుల సాక్షిగా కొంతమంది రౌడీషీటర్లు తల్వార్లు తిప్పడం కలకలం రేపింది. రౌడీలు హల్ చల్ చేస్తున్నా పోలీసులు మాత్రం అలాగే ఉండిపోయారు. పోలీసులపై రౌడీలు తిరుగబడటంతో రెండు సార్లు పోలీసులు రెండు సార్లు లాఠీలకు పని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసుల వల్లనే రౌడీలు రెచ్చిపోతున్నారని పోలీసులపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తులు తల్వార్ లతో పోలీసుల సాక్షిగా ఇలా ప్రవర్తించడం పట్ల శాంతి భద్రతలు అదుపు తప్పతున్నాయి.