
హైదరబాద్ కుల్సుంపురాలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇవాళ ఉదయం రౌడీ షీటర్ అబ్దుల్ ఖాదీర్ ఖాన్ ను మరో రౌడీషీటర్ మహమ్మద్ అక్బర్, అతని స్నేహితుడు హత్యచేశారు. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఖాదీర్ చనిపోయాడు. హత్య అనంతరం రౌడీ షీటర్ అక్బర్ అతని అనుచరులు కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసిన కుల్సుంపురా పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు .కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.