రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి..అద్దిరిపోయే స్టోరీ సెట్ అయ్యిందంటా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి..అద్దిరిపోయే స్టోరీ సెట్ అయ్యిందంటా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), జెర్సీ" ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Goutham Thinnanuri) డైరెక్షన్ లో  VD12 చిత్రం రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన  మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇక మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

విజయ్ దేవరకొండ కోసం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అద్దిరిపోయే స్టోరీ రెడీ చేసినట్టు సమాచారం. ఈ స్టోరీ  గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లోనే మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(SreeLeela) నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా కోసం ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. వీరి నుంచి వచ్చిన జెర్సీ మూవీలోని సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరి కాంబోలో అద్దిరిపోయే సాంగ్స్,  గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. 

విజయ్ దేవరకొండ అంటే లవర్ బాయ్ గానే కాదు..యాక్షన్ హీరో అనే రేంజ్ లో రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో  పోలీస్ టోపీ పెట్టుకుని..ముఖానికి నల్ల గుడ్డ కట్టుకున్నాడు విజయ్. దీనికి ..నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి.. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు..నేనొక అనామక గూఢచారి అంటూ రాసుకొచ్చిన డైలాగ్..ఈ చిత్రంపై మరింత ఆసక్తి కలిగేలా చేశాయి. 

ఈ మధ్య టాలీవుడ్,కోలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాల వివరాల్లోకి వెళ్తే, గ్యాంగ్ స్టార్ కథలే ఎక్కువ వస్తున్నాయి. ప్రభాస్ నుంచి సలార్, విజయ్ లియో, లేటెస్ట్ గా రజినీ జైలర్ తెరకెక్కుతున్నాయి. విజయ్ దేవరకొండ VD12 కి అన్నీ సెట్ అయితే కనుక సినిమా అద్దిరిపోవడం కన్ఫర్మ్ అంటున్నారు ఆడియన్స్. సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ప్రసెంట్ విజయ్ దేవరకొండ..సమంత 'ఖుషి' మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం.మలయాళం,హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.