సీసీటీవీ ఫుటేజ్: రౌడీషీటర్ దారుణ హత్య

సీసీటీవీ ఫుటేజ్: రౌడీషీటర్ దారుణ హత్య

చెన్నై కాశిమేడులో రౌడీషీటర్ దారుణ హత్య జరిగింది. దివాకర్ అనే రౌడీషీటర్‌ను అతని ప్రత్యర్థులు కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు. దివాకర్ బుధవారం సాయంత్రం ఇంటిముందు తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. దివాకర్ రోడ్డు పక్కన నిల్చొని స్నేహితుడితో మాట్లాడుతుండగా.. అటుగా వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా దివాకర్‌పై దాడి చేశాడు. ఏం జరుగుతుందో దివాకర్ తెలుసుకునేలోపే.. పక్కనే మాటువేసి ఉన్న మరి కొంతమంది వ్యక్తులు కత్తులు, కర్రలతో ఎటాక్ చేశారు.

దాదాపు 8 మంది ఒకేసారి దాడి చేయడంతో దివాకర్‌తో అప్పటివరకు మాట్లాడుతున్న వ్యక్తి కూడా అక్కడినుంచి పారిపోయాడు. ప్రత్యర్థుల దాడిలో దివాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దివాకర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

వైరల్ వీడియో: విమానంలోకి పావురం.. పట్టుకోవడానికి ప్రయాణికుల పాట్లు

బస్సును ఢీకొన్న రైలు.. మూడు ముక్కలైన బస్సు

మార్చిలో బ్యాంక్‌లకు 12 రోజులు సెలవులు

నాకు కేసీఆర్ నుంచి ప్రాణహాని ఉంది