
అస్సాం నాగాన్ జిల్లాలో హల్ చల్ చేస్తోంది రాయల్ బెంగాల్ టైగర్. భారీ వర్షాలు, వరదలతో వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు కొట్టుకొచ్చిన టైగర్..పొలాల్లోని ఇద్దరు రైతులపై దాడి చేసింది. దీంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో రాయల్ బెంగాల్ టైగర్ లావోకోవాలోని బుర్హాచపోరి వన్యప్రాణి అభయారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు అధికారులు.
నాగాన్ జిల్లాలో 30వేల మంది ప్రజలు వరదలతో ప్రభావితం అయ్యారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం వన్యప్రాణి అభయారణ్యాలపై సైతం పడింది. కజిరంగా నేషనల్ పార్కులో ఖడ్గ మృగం, పంది జింకతో సహా 17వన్యప్రాణులు వరదలో కొట్టుకుపోయాయి. 72వన్యప్రాణులను రక్షించారు అటవీ అధికారులు.