ఛాలెంజ్ అంటే ఇదీ : కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. బీజేపీ మంత్రి రాజీనామా

ఛాలెంజ్ అంటే ఇదీ : కాంగ్రెస్ పార్టీ గెలిచిందని.. బీజేపీ మంత్రి రాజీనామా

పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి  కిరోదిలాల్ మీనా.. నా నియోజకవర్గాల పరిధిలో.. నేను చెప్పిన నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోతే.. కాంగ్రెస్ గెలిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. ఏ ముహూర్తాన సవాల్ చేశారో ఏమో.. ఆయన ఛాలెంజ్ చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది.. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.  రాజకీయాల్లో ఇవన్నీ కామనే అని దాదాపు అందరూ లైట్ తీసుకుంటారు.. ఈ బీజేపీ మంత్రి మాత్రం అలా తీసుకోలేకపోయారు... చెప్పినట్లు.. ఛాలెంజ్ చేసినట్లు.. సవాల్ విసిరినదానికి కట్టుబడి.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

లోక్‌సభ ఎన్నికల సమయంలో కిరోదిలాల్ మీనా తూర్పు రాజస్థాన్‌లోని 7 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. ఇందులో ఏ  ఒక్క స్థానంలోనైనా బీజేపీ ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అయితే  దౌసా స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది. ఈ ఏడు స్థానాల్లో దౌసా, కరౌలి-ధోల్‌పూర్, టోంక్-సవాయి మాధోపూర్, భరత్‌పూర్ స్థానాలతో కూడిన 4 స్థానాలను బీజేపీ కోల్పోయింది.దీంతో  మీనా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.  

ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని మీనా స్వయంగా ఓ టీవీ ఛానెల్‌ ద్వారా వెల్లడించారు

Also Read:మంచిదొంగ.. నెల రోజుల్లో తిరిగి ఇస్తానని దొంగతనం

  ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని మీనా స్వయంగా ఓ టీవీ ఛానెల్‌ ద్వారా వెల్లడించారుసీఎం భజన్ లాల్ శర్మ తనను రాజీనామా చేయవద్దని కోరారని, అయితే తాను అన్ని పదవులకు రాజీనామా చేశానని అన్నారు. . నిజానికి, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా రాజస్థాన్ ప్రభుత్వంలో వ్యవసాయ, గ్రామీణ మంత్రిగా కిరోదిలాల్ మీనా ఉన్నారు.