
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు టీమ్ కు స్మృతి మంథాన సారథ్యం వహిస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: స్మృతీ మంథాన (కెప్టెన్), సోఫీ డివైన్, హీథర్ నైట, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దిషా కసత్, ఎల్లిస్ పెర్రీ, కనిక అహుజా, ఆషా శోభన, ప్రీతి బోస్, మెగాన్ షట్, రేణుకా సింగ్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజాన్ కప్, జెమీమా రోడ్రిగెజ్, అలైస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, టారా నోరిస్, శిఖా పాండే.