RR vs SRH: బట్లర్, సంజూ వీర బాదుడు ..సన్ రైజర్స్కు భారీ టార్గెట్

 RR vs SRH: బట్లర్, సంజూ వీర బాదుడు ..సన్ రైజర్స్కు భారీ టార్గెట్

ఐపీఎల్ 2023లో భారీ స్కోర్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచులోనూ రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సంజూ శాంసన్ సేన...20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.  ఓపెనర్లుగా దిగిన జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ రాజస్థాన్ కు మంచి ఆరంభాన్ని్చ్చారు. తొలి వికెట్ కు 4.6 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. అయితే 18 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసిన యశస్వీజైస్వాల్ మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

బట్లర్ సెంచరీ మిస్

యశస్వీ జైస్వాల్ ఔటయ్యాక బట్లర్ విశ్వరూపం చూపించాడు. హైదరాబాద్ బౌలర్లను హడలెత్తిస్తూ వీర బాదుడు బాదాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. 33 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన బట్లర్..ఆ తర్వాత సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అటు సంజూ శాంసన్ కూడా అర్థ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వీరిద్దరు రెండో వికెట్ కు 138 పరుగులు జోడించారు. అయితే సెంచరీకి చేరువలోకి వచ్చిన బట్లర్..95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. బట్లర్ ఔటైనా..సంజూ శాంసన్ బ్యాట్ ఝూళింపించడంతో రాజస్థాన్ రాయల్స్ చివరకు  20 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ , మార్కో జాన్సెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.