RRB భారీ నోటిఫికేషన్.. రైల్వే జాబ్ కొట్టాలంటే ఇప్పుడే ట్రై చేయాలె.. డిగ్రీతో 5 వేల 810 రైల్వే ఉద్యోగాలు

RRB భారీ నోటిఫికేషన్.. రైల్వే జాబ్ కొట్టాలంటే ఇప్పుడే ట్రై చేయాలె.. డిగ్రీతో 5 వేల 810  రైల్వే ఉద్యోగాలు

రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్ఆర్​బీ) నాన్– టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ(ఎన్​టీపీసీ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5,810 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 20. 

పోస్టుల సంఖ్య: 5810.

పోస్టులు: స్టేషన్ మాస్టర్ 161, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 615, ట్రాఫిక్ అసిస్టెంట్ 3416, చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్ వైజర్ 921, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59. 

సికింద్రాబాద్ ఆర్ఆర్​బీ:  396 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 74, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 180, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 22, చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్ వైజర్ 34, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్ 71.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్​/ హిందీ టైపింగ్​లో ప్రావీణ్యం ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్​మెన్​లకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 21.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు, మైనార్టీలకు, ఈబీసీ, ట్రాన్స్​జెండర్లకు రూ.250. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.500. 

లాస్ట్ డేట్: నవంబర్ 20.

సెలక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ). 

గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్​వైజర్ పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2 ఆధారంగా ఎంపిక చేస్తారు. 
స్టేషన్ మాస్టర్ పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీబీఏటీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. 
సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2, టైపింగ్ స్కిల్​టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.rrbapply.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.  

ఎన్​టీపీసీ (అండర్ గ్రాడ్యుయేట్) 
పోస్టుల సంఖ్య: 3050. 
పోస్టులు: జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ (జనరల్) 163, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్ (అకౌంట్స్) 394, ట్రైన్ క్లర్క్ (ఆపరేటింగ్) 77, కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 2424. 
సికింద్రాబాద్ ఆర్​ఆర్​బీ: జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ (జనరల్) 11 ట్రైన్ క్లర్క్ (ఆపరేటింగ్) 5, కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 276.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 28
 లాస్ట్ డేట్: నవంబర్ 27.
సెలక్షన్ ప్రాసెస్:  అన్ని పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2 నిర్వహిస్తారు. జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ ఉంటుంది.

సీబీటీ 1 (స్క్రీనింగ్) 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్​నెస్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్​నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 1.30 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

జనరల్ అవేర్​నెస్​ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు, మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు ఇస్తారు.
కనీస అర్హత మార్కులు: అన్ రిజర్వ్​డ్ 40 శాతం, ఈడబ్ల్యూఎస్​ 40 శాతం, ఓబీసీ 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

సీబీటీ 2 (మెయిన్ ఎగ్జామ్)   

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 లోనూ మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల స్థాయి సీబీటీ 1 కంటే కఠినంగా ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు. 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 1.30 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. జనరల్ అవేర్​నెస్​ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు, మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు 35 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఇస్తారు.

సీబీఏటీ  

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూట్ టెస్ట్ (సీఏబీటీ) కేవలం స్టేషన్ మాస్టర్ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో కనీస అర్హత సాధించాలంటే 42 మార్కుల టీ– స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్​లో ప్రశ్నలు ఇంగ్లిష్​/ హిందీలో మాత్రమే ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. సీబీటీ –2కు 70 శాతం వెయిటేజీ, సీబీఏటీకు 30 శాతం వెయిటేజీ కేటాయించారు. 

స్కిల్ టెస్ట్ 

సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అభ్యర్థులు ఎడిటింగ్ టూల్స్, స్పెల్​చెక్ సౌకర్యం లేకుండా పర్సనల్ కంప్యూటర్​లో నిమిషానికి 30 పదాలు (డబ్ల్యూపీఎం) ఇంగ్లిష్ లేదా హిందీలో  నిమిషానికి 25 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది.