RRR ప్రెస్ మీట్ ఫుల్ డీటెయిల్స్

RRR ప్రెస్ మీట్ ఫుల్ డీటెయిల్స్

హైదరాబాద్ : అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలతో తీస్తున్న కల్పిత సినిమా RRR గురించి అత్యంత ఆసక్తికరమైన విశేషాలను వివరించారు చిత్ర యూనిట్.

రాజమౌళి చెప్పిన అంశాలు ఇవి. 

  • పాత్ర పేర్లు రామరాజు- రామ్ చరణ్, భీమ్ – ఎన్టీఆర్.
  • ఇది తెలుగు వీరుల కథ. అందుకే తెలుగు హీరోలతోనే చేస్తున్నాం.
  • ఎవరి పాత్ర సినిమాలో ముందు పరిచయం అయితే వాళ్ల పేరే మొదట వస్తుంది.
  • ఇద్దరి పాత్రలు బలమైనవే. అభిమానులకు డౌట్స్ వద్దు.
  • సినిమాలో ప్రత్యేకంగా విలన్లు లేరు. పాత్రలే హీరోలు, విలన్లుగా మారుతుంటాయి.
  • అజయ్ దేవ్ గణ్ అడగ్గానే డేట్స్ ఇచ్చారు. రామ్ చరణ్ జోడీగా సీతగా ఆలియాభట్ ది కీలక పాత్ర. ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గర్ జోన్స్ ది మరో కీలకమైన పాత్ర.
  • RRR సినిమాకు సీక్వెల్ ఉండదు. వందశాతం సింగిల్ సినిమా. బాహుబలి కథ పెద్దది కాబట్టి.. ముందుగానే దానిని 2 పార్టులు తీయాలనుకున్నాం. తీశాం.
  • 2020లోనే రిలీజ్ చేస్తాం. పోస్ట్ పోన్ ఉండదు.
  • కాపీ అని.. పాత్రలను కించపరిచారంటూ వివాదాలు వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోం. వివాదాలు రాకుండా చూసుకుంటాం.
  • 1920ల్లో మొదలై.. ఇండిపెండెన్స్ ఫైట్ కు ముందు సినిమా ముగుస్తుంది.
  • RRR కామన్ టైటిల్. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెడతాం.
  • నార్త్ లో జరిగే కథ కాబట్టే.. నార్తిండియన్ నటులను తీసుకుంటున్నాం.

జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన వివరాలు

  • ఇగో లేకుండా నాతో సినిమా ఒప్పుకున్న చెర్రీక్ థాంక్స్
  • రాజమౌళి కాబట్టే ఈ సినిమా సాధ్యమవుతోంది

రామ్ చరణ్ చెప్పిన సంగతులు

  • ఏడాది కిందట ఇంటికి పిలిచి రాజమౌళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. లైన్ చెప్పగానే మూవీ ఓకే చేశాం.
  • 2019 సెకండాఫ్ లో సైరా విడుదల
  • సైరా, అల్లూరి పాత్రల సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.

డీవీవీ దానయ్య చెప్పిన వివరాలు

  • ఇద్దరు భారీ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమా చేయడం అదృష్టం
  • 2020 జులై 30న ఇండియాలోని 10 భాషల్లో సినిమా రిలీజ్