‘RRR’ ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : రామరాజు, భీంల స్నేహం

‘RRR’ ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ : రామరాజు, భీంల స్నేహం

రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా RRR. ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా  ‘RRR ’ టీమ్ ఆదివారం ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు విషెస్ తెలిపిన యూనిట్..ఓ ట్వీట్ చేసింది.  ‘అద్భుతమైన స్నేహం ఎప్పుడూ అనుకోకుండానే మొదలవుతుంది. రామరాజు, భీంల స్నేహం మాదిరిగా.. మీ జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడిని కలిసి ఉంటారు. అలా కలిసిన వ్యక్తుల్లో మీ జీవితంలో మీకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఎవరు? ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అతనితో దిగిన ఫొటోను మాతో పంచుకోండి’’ అని ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో అలియాభట్‌, అజయ్‌ దేవ్‌ గణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.