
నాటు నాటు (Naatu Naatu) పాటకు ఆస్కార్ దక్కడంతో పాటు రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్(NTR) కు మంచి గుర్తింపు లభించింది. ఈ ఉత్సాహంతో అమెరికాలో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్పందించారు. హాలీవుడ్ ప్రాజెక్టు చేయబోతున్నట్లు చెప్పారు. అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. స్టోరీ రెడీ అయితే అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్15 సినిమా షూటింగ్ దశలో ఉంది. అమెరికా నుంచి రాగానే షూటింగ్ మొదలు పెడతారని టాక్. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్కనగరాజ్ తో చరణ్ ఒక సినిమా చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.